NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.…
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
DGP Rajendranath Reddy :ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఖాకీల బదిలీలు వారి మధ్య చిచ్చు పెట్టాయా? సమస్య డీజీపీ దగ్గరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
balakrishna surprised his fan in kurnool: హీరో నందమూరి బాలకృష్ణలో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. తాజాగా బాలయ్య మరోసారి ఫ్యా్న్స్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలులో గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే గతంలో ఓ అభిమానికి బాలయ్య మాట ఇచ్చారు. ఈసారి కర్నూలులో వస్తే తప్పకుండా కలుస్తానని…
వారసుడిని చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇంతలో మరో నాయకుడు అక్కడ కర్చీఫ్ వేసేందుకు పావులు కదుపుతున్నారట. ఈ ఎత్తుగడల మధ్య అధికారపార్టీ రాజకీయాలపై చర్చ స్పీడందుకుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అక్కడ పార్టీకి గట్టి పునాదులే వేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లపై ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్‌యలు చేశారు..
కర్నూలు జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగించినట్టే కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్లోను సత్తా చాటింది. మున్సిపల్ కార్పొరేషన్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, 52 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. అంతమంది ఉన్నారు కదా.. పార్టీ బలంగా ఉంటుందని భావించిన కేడర్‌కు చుక్కలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే…