Srisailam Dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరదతో నిండుకుండలా మారింది. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో : 1,51,058 క్యూసెక్కులుగా వుంది. అలాగే, ఔట్ ఫ్లో : 1,47,254 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా వుంది. జలాశయంలో ప్రస్తుతం 885 అడుగుల నీరు వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం : 215.8070 టీఎంసీలుగా వుంది.
Vizag Railway Zone: విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు అంతా రెడీ
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నిండుకుండలా మారడంతో పర్యాటకులు కూడా భారీగా తరలివస్తున్నారు. అటు శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులు శ్రీశైలం జలాశయం చూడడానికి వస్తున్నారు. ఎడతెగని వర్షాల కారణంగా వారికి కాసింత అసౌకర్యం కలుగుతోంది. నదిలో నీరు ఎక్కువగా వుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
ఇటు తుంగభద్ర డ్యాం కూడా వరద నీటితో కళకళలాడుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. 30గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. 1633అడుగుల గరిష్ట నీటిమట్టానికి గానూ, ప్రస్తుతం 1631.88అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన తుంగభద్ర డ్యాం నుంచి వరదనీరు దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరదనీరు పోటెత్తుతోంది.
Bihar Politics: బీజేపీతో సీఎం నితీష్ కుమార్ తెగదెంపులేనా.. నేడు జేడీయూ కీలక సమావేశం
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?