Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నయనతార డేట్స్ అందుబాటులో ఉంటే ఆమెనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గతంలో కార్తీ, నయనతార కలిసి ‘కాశ్మోరా’ సినిమాలో నటించగా, వారి జోడీకి మంచి ఆదరణ లభించింది. అలాగే దర్శకుడు మోహన్ రాజా – నయనతార కాంబినేషన్లో ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే ఒకవేళ నయనతార డేట్స్ అందుబాటులో లేకపోతే, స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసే అవకాశాలను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలా జరిగితే ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కార్తీ – త్రిష జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబినేషన్‌పై కూడా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే హీరోయిన్ ఎంపికకు సంబంధించి ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!