కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారాలు ఉండడం మనం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. వీటికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే హోలీ పండగ అనగానే అందరికీ గుర్తు వచ్చేవి రంగులు, కాముని దహనం. దేశవ్యాప్తంగా హోలీ పండగను చాలామంది పెద్ద ఎత్తున జరుపుకుని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మాత్రం.. హోలీ పండుగ అనగానే కొత్త చీరలు, నగలు, అలంకరణ అన్ని చేసుకొని…
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటివి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్ లో క్షుద్రపూజలు జరిగాయి. మట్టితో తయారు చేసిన బొమ్మలు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు జరిగాయని తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు. అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. గొర్రెల కాపరులు ఫారెస్ట్ లో క్షుద్రపూజలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తాంత్రిక పూజల పై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.