Kurnool Crime: కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
Read Also: Tata Nano EV : టాటా నానో ఈవీ వచ్చేస్తుంది?.. ధర ఎంతంటే?
కాగా, రెండు మృతదేహాలపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి బంధువులు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సక్రప్పను తమదైన స్టైల్ లో విచారణ చేయగా.. దారుణాన్ని వెళ్లగక్కినట్టు సమాచారం. ఆడపిల్ల పుడుతుందని గర్భిణీ అయిన భార్య, కూతురును సక్రప్ప హత్య చేశారు. ఇప్పటికే ఆడపిల్ల పుట్టిందని భార్యతో నిత్యం సక్రప్ప గొడవ పడేవాడు. పెళ్లైన ఏడాదికి మగబిడ్డ పుట్టినా.. అనారోగ్యంతో శిశువు మృతి చెందాడు.. ఆ తరువాత సమీరా పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని సలీమాకు వేధింపులు మొదలయ్యాయి. మగబిడ్డ పుట్టాలని గర్భిణీ అయిన భార్యను హింసించేవాడు. అందులో భాగంగా భార్యతో గొడవపడి కర్రతో కొట్టాడు సక్రప్ప. తల్లిని కొడుతుండగా చిన్నారి సమీరా డాడీ డాడీ అంటూ అడ్డుపడింది. నిర్దాక్షిణ్యంగా ఇద్దరిని గొంతు నులిమి హత్య చేశాడు.. ఆ తర్వాత.. సలీమానే సమీరాను హత్య చేసిందని.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు.. పోలీసులు గట్టిగా విచారిస్తే తానే హత్య చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం.