ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారాలు ఉండడం మనం అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. వీటికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే హోలీ పండగ అనగానే అందరికీ గుర్తు వచ్చేవి రంగులు, కాముని దహనం. దేశవ్యాప్తంగా హోలీ పండగను చాలామంది పెద్ద ఎత్తున జరుపుకుని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మాత్రం.. హోలీ పండుగ అనగానే కొత్త చీరలు, నగలు, అలంకరణ అన్ని చేసుకొని అబ్బాయిలు కాస్త అమ్మాయిలుగా మారిపోతారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో ఈ పండగ వచ్చిందంటే చాలు.. జంబలకడిపంబ సినిమా కనబడుతుంది. ఈ వింత ఆచారం తరతరాలుగా ఈ గ్రామంలో కొనసాగుతుంది. హోలీ పండుగ రోజున గ్రామంలో యువకులు, మగాళ్లు.. చీరలు కట్టుకొని మహిళలలా ముస్తాబవుతారు. ఆ తర్వాత భక్తి శ్రద్దలతో రతి మన్మధుడికి పూజలను చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. హోలీ రోజున పురుషులు ఆడవాళ్ళ మాదిరిగా వేషధారణ చేసుకొని పూజలు చేస్తే వారు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయని వారి నమ్మకం.
Also Read: Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు
ఇలా చేయడం వల్ల తమ పంటలు బాగా పండుతాయని ..గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని., అలాగే ప్రజల్లో ఆరోగ్య సమస్యలు ఎల్లవేళత్తవని.. అలాగే యువకుల ఆర్థిక సమస్యలు, పెళ్లి సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల ఆచార సంప్రదాయాలను చూడడానికి అక్కడికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఆంధ్ర – కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం కారణంగా కర్ణాటక భక్తులు ఎక్కువగా ఈ మొక్కలను చెల్లించడానికి వస్తారు.
HOLI CELEBRATIONS IN KURNOOL
MEN DRESS UP AS WOMEN