రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా.. పుట్టను అడిగినా సైకిల్ మాటే వినపడుతోందని.. కూటమి గెలుపు మాటే వినపడుతోందని చంద్రబాబు చెప్పుకుచ్చారు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించునున్నారు. రెండు రోజుల పాటు నేడు, రేపు విస్తృతంగా పర్యటించనున్నారు. ఇవాళ కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పం కు తీసుకురావడం ఎంతో సంతోషం.. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించల్సిన సందర్భం.. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు…
కుప్పం నా సొంత ఊరు అని.. కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండెకాయ లాంటిదని, అలాంటి తనకే ఇక్కడ రక్షణ లేదన్నారు. కుప్పంలో రౌడియిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజు సమయమే ఉందన్నారు.…