Hospital Fraud: వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు
- కూకట్‌పల్లిలోని అమోర్ హాస్పిటల్‌లో ఘరానా మోసం.
- వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు
- కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospital Fraud: కూకట్‌పల్లిలోని అమోర్ హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో వైద్యం నిమిత్తం హాస్పిటల్‌ను ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యం, థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని బాధితులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ఈ విషయమై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది చెప్పి, వారికి తెలియకుండానే బాధితురాలి బావ పేరుపై లోన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత బాధితులు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు సమస్యను పరిష్కరించడానికి బదులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ బాధితులను హాస్పిటల్ నుంచి బయటకు నెట్టివేశారు. ఈ ఘటన బాధితులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?
ఈ మోసంలో భాగంగా బాధితుల పేరుపై రూ. 1,14,539 బ్యాంక్ లోన్ ఉన్నట్లు వెల్లడైంది. థర్డ్ పార్టీ బ్యాంక్ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి, మీరు లోన్ కట్టాల్సిందే, లేకపోతే సిబిల్ స్కోర్‌లో సమస్యలు వస్తాయి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాట్లు బాధితులు తెలిపారు. ఈ బెదిరింపులు బాధిత కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా బాధితులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమోర్ హాస్పిటల్ యాజమాన్యం చేసిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!