Sahasra M*rder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడు హంతకుడిగా తేల్చిన పోలీసులు.. బ్యాట్ కోసం వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అయితే.. ఇప్పటికే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. తమ బంధువులతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.…
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై లైంగిక దాడికి యత్నించాడు. పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం సృష్టించింది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారికి కత్తి చూపించి బెదిరించిన దుండకులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు అగంతకులు వ్యాపారిపై దాడి చేసి జేబులో నుంచి డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్‌పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చారు.. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు…