ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా కొనసాగుతున్న మణికందన్‌కు ఓ ఐడెంటిటీని ఇచ్చింది జై భీమ్. అప్పటి వరకు రైటర్‌గా ఫ్రూవ్ చేసుకున్న ఇతడ్ని కంప్లీట్ స్టార్ చేసిందీ సినిమా. జై భీమ్ సైడ్ ఆర్టిస్ట్‌ను మెయిన్ హీరోగా మార్చేసింది. 2023లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్, రొమాంటిక్ కామెడీ గుడ్ నైట్‌తో సోలో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు మణి. గురక కాపురంలో ఎలా చిచ్చుపెట్టిందో చూపించిన సినిమానే గుడ్ నైట్.…