MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ ష్కాంలో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను నేడు, రేపు (సోమ, మంగళవారా)ల్లో ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడాన్ని, అంతేకాకుండా.. కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సీబీఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.
Read also: Nehru Zoological Park: సరికొత్త రికార్డ్.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
కవిత వాదనలు సోమవారం, ఈడీ, సీబీఐ వాదనలు మంగళవారం పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా.. ఆదివారం రాత్రి 10 గంటల లోపు ఈ-మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది. కాగా, మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16వ తేదీన రూస్ అవెన్యూ ఆమెను కోర్టులో హాజరుపరిచింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రూస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. తీహార్ జైలులో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు రెండు నెలల పాటు ఉన్నారు.
Nehru Zoological Park: సరికొత్త రికార్డ్.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!