KTR : సీఎం, మంత్రుల పంపకాల పరంపర.. రాష్ట్ర పరువుకు మచ్చ
- కేటీఆర్ ప్రెస్ మీట్‌లో రాష్ట్రంలోని అవినీతి, పంపకాలపై విమర్శ
- రిజ్వి రిటైర్మెంట్, టెండర్ వివాదంపై ఘాటైన వ్యాఖ్యలు
- పారిశ్రామిక వేత్తల బెదిరింపు, సెటిల్‌మెంట్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు
- కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” అని అన్నారు. నిజాయితీ పరుడిగా పేరున్న రిజ్వి వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం అల్లుడు, మంత్రి కుమారుడి మధ్య టెండర్ వివాదం కారణంగా ఒక అధికారి పదవి వదిలేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర పరిపాలన దిగజారిపోతున్నదనే సంకేతమని కేటీఆర్ విమర్శించారు. “ఈ ప్రభుత్వం నడుపుతోంది ముమ్మాటికీ దండుపాళ్యం ముఠా లాగే,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, “ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే జైలుకు వెళ్లాల్సిందే. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీసింది. ముఖ్యమంత్రి ఇల్లు పరిపాలనా కేంద్రమా లేక సెటిల్‌మెంట్‌ల అడ్డానా?” అని ప్రశ్నించారు.
Also Read
తాజాగా వెలుగులోకి వచ్చిన తుపాకీ వివాదంపై కూడా కేటీఆర్ స్పందించారు. “మంత్రి కుమార్తె చెప్పింది.. సీఎం రేవంత్ రెడ్డి తుపాకీ ఇచ్చారని. మరోవైపు కొండా మురళి తుపాకీ ఇచ్చారని అంటున్నారు. ఏది అయినా సరే పారిశ్రామికవేత్తను బెదిరించడం నిజమే. పోలీసులు నిజాయితీ వంతులు అయితే దోషులను అరెస్ట్ చేయాలి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పరిధిలో రౌడీ మూకల ర్యాలీలు, పోలీసుల వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు.
“నా జీవితంలో మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం చూడలేదు. కానీ ఈ రోజుల్లో అది కూడా జరుగుతోంది. ఇది పాలనా పతనానికి సంకేతం,” అని అన్నారు. అంతేకాకుండా.. “ఇలాంటి సెటిల్‌మెంట్‌ల ముఖ్యమంత్రిని నేను ఇప్పటి వరకు చూడలేదు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్–బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. బీజేపీ నేతలు, ముఖ్యంగా బండి సంజయ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు..!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!