తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్‌లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..…
తెలంగాణలో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ తెరలేపారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. ఇవాళ సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని తెలిపారు.. టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వమని ప్రకటించిన ఆయన.. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మత్తల్లు దుకించినా ఘనత కేసీఆర్‌దే అన్నారు.. రైతాంగానికి రైతు బీమ, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్…
మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్…
జూనియర్ డాక్టర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ఇవాళ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇవాళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆమె ట్వీట్ కు బదులు ఇచ్చారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను…
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కో కి అభినందనలు తెలిపింది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో అత్యధికంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కానీ ఈ సమయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లో పరిస్థితి మెరుగ్గా ఉంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకక చనిపోయిన వాళ్ళు లేరు అని అన్నారు. మొత్తం వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెప్పించింది గ్రీన్ కో… అందులో మొదటి 200 తెలంగాణ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు…
తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు.…
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ ‘జాతి రత్నాలు’ చిత్రంపై ప్రశంసలు…
బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పట్టించుకోలేదు.. అందుకే ఐటీఐఆర్ రద్దు అంటున్నారు.. మరి బెంగుళూరులో ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. 2014 నుండి మేం కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్న ఆయన.. అనేక సార్లు లేఖలు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.. మేం చెప్పేదంట్లో తప్పు ఉంటే చెప్పండి ఎక్కడికి అయినా వచ్చి మాట్లాడటానికి…
ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా…