హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. 2017 లో మంత్రి కేటీఆర్ శంకు స్థాపన చేసిన.. బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ. 385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రెండు డివిజన్లు ఉండగా… ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. ఇక ఈ రెండు డివిజన్లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక, సీఎం పర్యటనను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్ననే పర్యటించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్నా సీఎం…
రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని మరోసారి వెల్లడించారు మంత్రి కేటీఆర్.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పంపిణీ చేసిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.. వేములవాడలో ఎంత చేసినా తక్కువే.. వేములవాడ పట్టణంలో ఇంటి ఇంటికి నల్ల నీరు 60 శాతం పూర్తి అయ్యిందని.. దసరా వరకు పూర్తి చేసి అందరినీ త్రాగునీరు అందిస్తామన్నారు.. ఇక, 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు..…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరానికి పురమాయిస్తూ ఉంటారు… తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికి ఇక్కడ కొందరు డబ్బుల కోసం తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్…. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. కాగా..మాజీ మంత్రి ఈటెల…
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.. ఆయా రంగాల వారీగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి.. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది తెలంగాణ సర్కార్. అందులో భాగంగానే ప్రకృతిని కాపాడేందుకు… ముఖ్యమంత్రి కేసీఆర్ ”హరితహారం” అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ప్రతి యేటా… వర్షాకాలం ఆరంభ సమయంలో ”హరితహారం” కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది కేసీఆర్ సర్కార్. read also : తెలంగాణ కోవిడ్ అప్డేట్.. ఈరోజు ఎన్ని కేసులంటే..? ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు…
గ్రేటర్ హైద్రాబాద్ లో నేటి నుంచి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే PV మార్గ్ అంబేద్కర్ నగర్ లో GHMC నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు KTR , తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పీవీ మార్గ్ లో ఈ ఇళ్ళకు కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుందని.. పేదల కోసం ప్రభుత్వం ఇల్లు కట్టిచ్చిందని పేర్కొన్నారు.…
నాగోల్ లోని ఫతుల్లాగూడాలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్దాల రీ-సైకలింగ్ ప్లాంట్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్తా ఉత్పత్తి అవుతుంది. అందుకే గతంలో ఉన్న 70 చెత్తా కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ను 100 కు పెంచుతున్నాం. ఇంకా చెత్తను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశాం. మనం గ్రేటర్…