కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్న కేటీఆర్… కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కేటీఆర్ కోరారు.
read also : అసత్య ప్రచారం చేస్తే నాలుక కోస్తాం : ఏపీ మంత్రి
ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని చెప్పిన కేటీఆర్…. గతంలోనూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ మూసివేత లక్షలాదిమందికి అనేక ఇబ్బందులు తీసుకువస్తుందని కేటీఆర్ అన్నారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి వెంటనే స్పందించి మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.