కేటీఆర్ బర్త్ డే : ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్ననియమాన్ని సడలించినట్లు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవటం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా విలువైనదని ఎంపీ సంతోష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్పంచ్ లు 2 కోట్ల 5 లక్షలు మొక్కలు, GHMC మేయర్, కార్పొరేటర్ లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్ లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో 50 లక్షల మొక్కలు, HMDA పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం కలిపి 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయనే సమాచారం అందిందని నిర్వాహకులు తెలిపారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయితీ రాజ్ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించామని వెల్లడించారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!