ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగతుంది. శాసనభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్పై చర్చ చేపడతారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరపనున్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ - 2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీలో భాగంగా వారం రోజుల పాటు హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ను నిర్వహించనున్నారు.
MIM V/s BRS: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నగర అభివృద్ధి పై ప్రసంగించారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని మండిపడ్డారు.
Off The Record about BRS Sitting MLAs: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటు అధికార BRS పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు దక్కుతాయి..? కొత్తవారికి అవకాశం ఉంటుందా..? ఇటు విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ అభ్యర్థులుగా బరిలో ఉండేది ఎవరు అన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం…
పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. చిల్లర గుండా నాయకులతో నన్ను తిట్టిస్తే తిట్టిస్తవేమో కానీ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నావో చెప్పని? ప్రశ్నించారు.
దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చ కు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్ లు ఓట్ల కోసం ఉంటాయన్నారు.
నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇవాళ నిజామాబాద్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో కొత్త నిర్మస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
BJP Leader Laxman : సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవాలని లక్ష్మణ్ సూచించారు.
ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.