ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలు ఒక విషయంలో ఐక్యతారాగం వినిపిస్తున్నారు. వారంతా ఒక్క త్రాటి మీదకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం కొలిక్కి వస్తాయో కాని, వారి సమావేశాలు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాయంట. ఇప్పటికే ఒక్క దఫా హైదరాబాద్ లో సమావేశాలు అయిన నేతలు మరోసారి ఖమ్మంలో సమావేశం కానున్నారు. ఇది అంతా మాజీ ఎంపి పొంగులేటిని ఎదుర్కోవడం కోసం అధిష్టానం చూసించిన మేరకు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ యేడాది ప్రారంభం నుంచి ఆత్మీయ సమావేశాల పేరిట మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో సస్పెన్షన్ ల పర్వానికి కూడా తెర తీశారు. అలా అధికార పార్టీలో ఇప్పుడు సంచనాలకు కారణం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపి గా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతలు ఒక్కటి అవుతున్నారు. ఇప్పటికే ఒక్కసారి హైదరాబాద్ లో నేతలు అందరు సమావేశం అయ్యారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఒక్కసారి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం అయ్యారు. మాజీ ఎంపి పొంగులేటి వర్గం వైపు ఎవ్వరు వెళ్లకుండా కట్టడి చేయాలని అదే విదంగా అందరు కలసి కట్టుగా ఉండాలని భావించారు.
Read Also: BRS Leaders Unity: పొంగులేటికి వ్యతిరేకంగా ఐక్యతా సమావేశాలు
అదే విధంగా మరోసారి ఖమ్మంలో కూడా సమావేశం కావాలని గత వారం రోజుల క్రితం నిర్ణయించారు. ఈ మేరకు మళ్లీ ఈరోజు ఆదివారం నాడు ఖమ్మంలోని బిఆర్ఎస కార్యాలయంలో సమావేశం కానున్నారు. మంత్రి అజయ్ కుమార్ తో పాటుగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్ధ సారథి రెడ్డి, ఎంపి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్ఎ లు, ఎంఎల్ సి లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గత కొద్ది రోజులుగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు అధికార పార్టీ ఊహించని విధంగా అనుచర వర్గం తరలి వస్తోంది. కొన్నిచోట్ల అయితే అధికార పార్టీ నేతలు రాజీనామాలు కూడా చేస్తున్నారు. పొంగులేటి వర్గానికి మద్దతు ఇస్తున్న వారిపై సస్పెన్సన్ వేటు వేస్తున్నప్పటికి అధికార పార్టీని వీడడానికి కూడా వెనకంజు వేయడం లేదు.
ఇటువంటి పరిణామాలు ఎక్కువగా వైరా, ఇల్లెందు, మధిర, పినపాక లో జరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి ఇంకా అన్ని నియోజకవర్గాలకు వ్యాప్తి చెందితే పరిస్థితి చేజారి పోతుందని బిఆర్ఎస్ నేతలకు భయం భయంగా ఉంది. దీంతో బిఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలకు తెర తీస్తున్నారు.ఈనేపథ్యంలో పొంగులేటిని జిల్లాలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారంట. అందువల్లనే పొంగులేటిని కట్టడి చేసే దానిలో భాగంగా ఎంపిలు, ఎంఎల్ఎ లు అందరు కలసి కట్టుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే అందరం ఒక్క త్రాటి మీద ఉండడం కోసం కలసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు.సమావేశాలను పెట్టుకుంటే అందరు ఐక్యంగా ఉన్నట్లుగా చాటుకోవాలని ఏ ఒక్కరి నియోజకవర్గంలో కూడా పొంగులేటి వేలు పెడితే అందరం సమిష్టిగా ఎదుర్కొవాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందంట. ఆ ఆదేశాల మేరకు మరోసారి అందరు బిఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారన్న సమాచారం.
Read Also: MLA Sayanna : బీఆర్‌ఎస్‌లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత