రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు…
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
చొప్పదండి ప్రచారంలో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై కేటీఆర్ నోరు పారేసుకోవడాన్ని ఆయన ఖండించారు. బుధవారం చొప్పదండి ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, యూజ్ లెస్ ఫెలో.. నిరుద్యోగులను బూతులు తిడతావా? అని మండిపడ్డారు. ఒక్కసారి ముడుతల చొక్కా, అరిగిన రబ్బర్ చెప్పుల గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం…
Renuka Chowdhury: మంత్రి కేటీఆర్ ఐటిలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అంటూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు.
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో పాటు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ప్రచారంలోకి దూసుకుపోతుంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలోని పెద్ద మల్లారెడ్డిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తెలంగాణ కరెంట్‌పై చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ తీగలు…
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటుంది. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతుండగా, మంత్రులు హరీశ్, కేటీఆర్, కవితలు పలు నియోజకవర్గాలు, కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడుతున్నారు.
Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ…