Telangana Top leaders to cast their votes in these polling stations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే మిగిలి ఉంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ హీరోలు ఎవెరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు చూశారు కదా ఇప్పుడు నేతలు ఎక్కడెక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి…
KTR participate in Deeksha Divas: హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చేపట్టిన ‘దీక్షా దివస్’పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని ఈసీ అధికారులు అనగా.. దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆపై తెలంగాణ భవన్కు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో…
కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం చెన్నూరులో ప్రచారం నిర్వహించిన వివేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నూరూలో కాకా ఫ్యామిలీ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతుండని మండిపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చ.. తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభమైంది, కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాకా వెంకటస్వామి తెలంగాణ వాది.. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం…
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఇక ప్రచారానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు మరింత దూకుడు పెంచుతాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని…
కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆమె ట్విటర్ వేదికగా కేటీఆర్, కేసీఆర్లపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు.. అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు మహానేత వైయస్ఆర్ గారు రచ్చ…
KTR Metro: హైదరాబాద్ మెట్రో రైల్ మంత్రి కేటీఆర్ (మెట్రో రైల్ లో కేటీఆర్) సందడి సృష్టించారు. సాధారణ ప్రయాణికుడిలా నిలబడి ప్రయాణం చేశాడు. మంత్రి వారి మధ్యకు రావడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
Minister KTR: ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తూంకుంట వరకు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, అయితే కేంద్ర మంత్రులను కలిసి రక్షణశాఖ భూములను ఇవ్వాలని కోరితే, అందుకు అంగీకరించలేదని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ స్కైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర,సమీకృత,సమ్మిళిత,సమతుల్య అభివృద్ధి కాదు కేటీఆర్ గారు.”అవినీతి,దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన”. ఆఫ్గనిస్తాన్ ను తలపించిన తాలిబాన్ల పాలన.5 లక్షల కోట్లు అప్పులు చేసి,ఒక్కో నెత్తిమీద 2 లక్షల అప్పు మోపి తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలే. Also Read: TS Weather:…