Revanth Reddy: గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది ఎన్ఆర్ఐ లకు ప్రజా స్వామ్య స్ఫూర్తి తెలియదన్నారు. 51 శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. సహేతుకంగా విశ్లేషణ చేయాలి ప్రతిపక్షం అన్నారు. అచ్చోసిన ఆంబోతులం ..పోడియం కి వస్తాం అంటే అహం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పదే పదే గత పాలన గురించి మట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడుని చేసింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ని ఎంపీ గా గెలిపించింది కాంగ్రెస్ అన్నారు. కేంద్ర మంత్రి చేసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడుని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది వైఎస్ అన్నారు.
Read also: Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
పోతిరెడ్డిపాడు పొక్క పెంచునప్పుడు కొట్లాడింది పీజేఆర్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆరోజు ఎవరు కొట్లాడలేదన్నారు. మా పార్టీ పీజేఆర్ కొట్లాడారని తెలిపారు. ఏ పాలకుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు అని, ఎలా ఎమ్మెల్యే అయ్యారన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, కేసీఆర్ గురువు దయతో ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు కేటీఆర్ ఇక్కడికి అంటూ తెలిపారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే..ఒకరోజు సమయం ఇవ్వండన్నారు. సంపూర్ణ చర్చ చేద్దామని తెలిపారు. గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామన్నారు. వరంగల్ ఎంకౌంటర్ లకు ఎవరు కారకులు? అని ప్రశ్నించారు. గవర్నర్ కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు అంటున్నారని, మా పాలసీ కి..కేబినెట్ ఆమోదం చేశామన్నారు. తొమ్మిదేళ్ల పాలనపై ఎక్స్ ర్ తీసినట్టు అన్ని బయట పెడతామన్నారు. పిల్లి శాపనర్దాలకు ఉట్లు తెగి పడవంటూ సెటైర్ వేశారు. ఏమి బయపడం.. సలహాలు ఇవ్వండి వింటాం అన్నారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు.
Purandeswari: పోలవరం ప్రాజెక్టును డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి..