తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం ఏర్పాడింది. అధికార కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు.. కొడంగల్ నుంచి బొంబాయికు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో.. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవి.. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలి.. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Also: Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. టాస్క్ ల పేరుతో 11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
దీంతో కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు.. ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుని పెద్ద మనసుతో చెప్పామని ఆయన తెలిపారు. దాడి చేయడం మొదలు పెట్టారు.. కేటీఆర్ తీరు సరిగ్గా లేదు.. కాంగ్రెస్ హయాంలో ఎందుకు నీళ్ళు లేవు.. వివరాలు చెప్పా మంటారా? అంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జనం నీరు తాగలేదా? అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka: మహిళపై దాడి చేసి వివస్త్రను చేసి ఊరేగించిన కేసులో ఇన్ స్పెక్టర్ సస్పెండ్
యాభై ఏండ్లలో ఏం చేశారు అంటారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రము వద్దనే తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది లెక్క.. కేంద్రాన్ని ఒప్పించి.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఆయన మండిపడ్డారు. సంపదతో మేము ఇస్తే.. రాష్ట్రాల అప్పుల పాలు చేశారు అని విమర్శలు గుప్పించారు. అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరు.. బాగు చేయాల్సింది పోయి.. అప్పుల పాలు చేశారు.. పాత ముచ్చటే మాట్లాడటం ఏంటి.. లక్షల కోట్లు వృధా చేశారు.. అదనంగా నీళ్లు ఇచ్చారా మీరు.. పదేళ్లు విద్వాంసం చేశారు.. స్వేచ్ఛ లేకుండా చేశారు మీరు అంటూ కేటీఆర్ పై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే ఎలా.. ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే.. నువ్వు కూడా ఆటే పో.. ఇక్కడ ఎందుకు మరి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.