Today(21-12-22) Business Headlines: దావోస్‌కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది.