కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అయితే వర్చువల్ పద్ధతిలో సాగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు ఎండింగ్ కోసం నీటి కేటాయింపుల కోసం సమావేశం నిర్వహించారు. 15 రోజులలో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు ప్రతిపాదనకు ఓకే చెప్పింది ఏపీ. త్వరలో పూర్తి స్థాయిలో నిర్వహించే మీటింగ్ కు హాజరవుతామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి.…