పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రామ్ ఆ తర్వాత ‘రెడ్’ మూవీ చేశాడు. ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’తో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి, లింగుస్వామి గురించి రామ్ చెబుతూ, ”వీరిద్దరూ ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ……
సినిమా కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతున్న ‘ద వారియర్’ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదే! లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ఈ బైలింగ్వల్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రామ్ పోతినేని కాదని తాజాగా తేలింది. రామ్ కంటే ముందు ఈ సినిమా స్టోరీ ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లింది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఐకాన్ స్టార్…
తమిళ కథానాయకుడు సూర్య, బాలా కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నంద’. ఆ సినిమా నటుడిగా సూర్యకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ‘పితామగన్’ సినిమా రూపుదిద్దుకుంది. ఇది తెలుగులో ‘శివపుత్రుడు’గా డబ్ అయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు బాలా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మూవీ పేరు ఖరారు చేశారు. తమిళంలో ‘వనన్ గాన్’ అనే పెట్టగా, తెలుగులో…
టాలీవుడ్లోని మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్లో కృతిశెట్టి ఒకరు. ‘ఉప్పెన’లాంటి బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ అమ్మడికి ఎనలేని క్రేజ్, గుర్తింపు వచ్చేసింది. ఫలితంగా.. వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. రామ్ పోతినేని సరసన ‘ద వారియర్’లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న…
ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది.
ఎస్ఆర్ ఎడిటర్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. నితిన్ హీరోగా ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా, చాలాకాలం నుంచి చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఒక్కొక్కటిగా క్రేజీ అప్డేట్స్ ఇస్తోంది. లేటెస్ట్గా ‘రా రా రెడ్డి’ మాస్ నంబర్ను రిలీజ్ చేశారు. ఈ పాట విన్న మొదటిసారే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం…
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో.. ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’.. తెలుగు, తమిళ భాషల్లో జులై 14న గ్రాండ్గా విడుదల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. మొన్న వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చెన్నైలో భారీ ఎత్తున జరిపారు. ఈ ఈవెంట్ కోసం తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ తారాగణం తరలొచ్చింది. స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, వెట్రిమారన్, భారతీరాజా,…