కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ. ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు…
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో…
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వివాదాల్లోని దేవాలయ భూములకు త్వరలో విముక్తి కలిగిస్తామన్నారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారులతో సమావేశమైన కమిషనర్ హరి జవహర్ లాల్ పలు అంశాలు ప్రస్తావించారు. దేవాదాయ భూముల సమస్యలు, ఆడిట్ లెక్కలు, కొత్త జిల్లాల్లో దేవాదాయ శాఖ కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి చర్చించారు. దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి బయటకు వస్తున్న సమయంలో మంత్రిని చూడగానే ఒక్కసారిగా భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో మంత్రి దర్శనానికి రావడంతో అధికారులు గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు మంత్రి కొట్టు సత్యనారాయణ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.…