అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…
పోడు రైతుల చలో ప్రగతిభవన్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామున సర్పంచ్ మడకం స్వరూప సహా గ్రామస్థులను అరెస్ట్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ చలో ప్రగతిభవన్కు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, ఎంపీపీ తక్షణమే రాజీనామాలు చేయాలని పోడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న గతంలో లాగే పోడు వ్యవసాయం చేసేందుకు గిరిజనులు సన్నద్ధం కావడంతో.. అధికారులు వీరిని అడ్డుకుకోవడంతో.. గిరిజనులు, అధికారులు మధ్య…
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖ భూముల వ్యవహారంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నష్ట పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మణుగూరు మండలం రామానుజవరం బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. అయితే తిప్పనపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. Read…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 3 వ తేదీన పాల్వంచలో రామకృష్ట అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని, ఆయన చేసిన అక్రమాల గురించి సెల్పీ వీడియోలో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. Read: చైనా…