ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. పంటలు పండకపోవటంతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గత యేడాది మిర్చి సాగు చేసిన రైతుల పంట పండింది. ఎగుమతులు సైతం పెరిగాయి. విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 18 వేల పైచిలుకు ధర పలుకుతోంది. గతంలో ఏసీ మిర్చికి మాత్రమే…