కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నీళ్ళు లేవు, నియామకాలు లేవన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క్. సింగరేణి అంటేనే కొత్తగూడెంకు ఒక ఆణిముత్యం.. కానీ ఇప్పుడు సింగరేణిని ఈ పాలకులు ఏలా తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు భట్టి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మద్దుతుగా కొత్తగూడెంలో పర్యటించారు. అక్కడ రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, భట్ విక్రమార్క్ పాల్గొన్నారు.
Also Read: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ లో ప్రజా సంపద అంతా ఈ ప్రజలకే చెందాలి కానీ అవి ఎవ్వరికీ చేందుతున్నాయన్నారు. తెలంగాణ వస్తే సింగరేణి బాగుపడుతుందని అందరూ ఆశించారు.. కానీ ఇప్పుడు ఎంత మంది కార్మికులు వలస వెళ్లారు ప్రశ్నించారు. ధనిక తెలంగాణ ఇప్పుడు ఏలా మారింది.. అప్పుల తెలంగాణగా మారిందన్నారు. ఈసారి తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యంమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ లు అమలు చేయడం కాయమన్నారు. మహిళాకు ఉచిత ప్రయాణం, గుది బండగా మారినా గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తామన్నారు.
Also Raed: Rajnath Singh: ఈ సారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..
రైతులకు న్యాయం జరిగే పథకాలు ఎన్నో హామీలు నేరవేరుస్తామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ మా సంక్షేమ పథకాలు ఏలా పంచుతారు అంటున్నారని, వాళ్లు పందికొక్కుల్లాగా దోచుకున్న లక్ష కోట్ల రూపాయలు కక్కించి జనంకు పంచుతామని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న సీపీఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించాలని కోరారు. ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనారిటీలు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై మమ్మల్ని నిలదీయండని భట్టి వ్యాఖ్యానించారు.