గతంలో మాదిరి ఇప్పుడు నవలా చిత్రాలు తెలుగులో రావడం తగ్గిపోయింది. ఆ లోటును తీర్చుతూ, ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే నటుడిగా గుర్తింపుతో పాటు, మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడి…