తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, హేమ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కొండపొలం’ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ నవలా చిత్రాన్ని ఇదే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా…