జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్…
కరోనా తర్వాత ఓటీటీ పుంజుకోవడంతో నటీనటులందరూ పుల్ బిజీ అయ్యారు. వారిలో హీరో త్రిగుణ్ ఒకరు. త్రిగుణ్ నటించిన కొండా మురళి, కొండా సురేఖ బయోపిక్ ‘కొండా’ 23న విడుదల కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి విలేకరులకు తెలియచేశాడు త్రిగుణ్. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ‘కొండా’ సినిమాలో సురేఖగా ఇర్రామోర్ నటించింది. ఈ సందర్భంగా…
కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోయింది కానీ ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాల షూటింగ్స్ తో అందరినీ యమా బిజీ చేసేసింది! జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చిరంజీవి మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ నాలుగైదు సినిమాలు చేస్తుండటం విశేషం. కాస్తంత గుర్తింపు ఉన్న ఏ హీరో జాబితా చూసినా రెండు సినిమాలకు మించి వారు కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిగుణ్ గా…
భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’,…
ప్రేమికులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి వరుసగా ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్జీవీ ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటో అనుకుంటున్నారా ? అదేనండీ… ఎప్పటిలాగే తనదైన శైలిలో వాలంటైన్స్ డే గురించి చెప్పుకొచ్చారు. “ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పను. ఎందుకంటే ప్రేమికులను ఐక్యంగా ఉంచడంలో వాలెంటైన్ డే…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్‌కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర…