సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు. కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.
ఈరోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి వీలులేదు.. కొందరు కేటుగాళ్ళు మహిళను నమ్మించి అతి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. తెలిసిన యువకుడు కదా అని నమ్మాడు.. నిండా ముంచేసాడు..ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు.. ఇక భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. దిశ…
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. దీని కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
Physical harassment: ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు కామాంధులు.. ఇక, కొన్ని ఘటనల్లో శీలానికి కుల పెద్దలు, గ్రామ పెద్దలు వెలకట్టిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఐదుగురు యువకులు.. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారు.. బాధితురాలి కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పి…
Today (14-02-23) Business Headlines: సుజుకీతో టీ హబ్ ఒప్పందం: జపాన్ కంపెనీ సుజుకీ మోటార్‌తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్‌లోని స్టార్టప్‌లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్‌లో ఎదురయ్యే ఛాలెంజ్‌లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Kothapeta Prabhala Utsavam: మకర సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను…