పొత్తులపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పారు.
Bhatti Vikramarka: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సచివాలయం ప్రారంభం అనంతరమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా ఉంది..
టైం లేదు.. ప్రతీ గ్రామాన్ని టచ్ చేయలేమన్నారు. బైక్ మీద తిరుగుతా అని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై హోటల్ ను ప్రారంభించారు.
Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడాది తర్వాత ఆయన గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు.
Komatireddy Venkat Reddy:సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. ఇన్ని రోజులు గాంధీభవన్‌లో అడుగుపెట్టని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏడాదిన్నర తర్వాత ఈరోజు గాంధీభవన్‌కు వెళ్లారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు.…
కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.