DK Aruna Says BRS Congress Will Join Hands In Next Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమని.. తాము చెప్పింది నిజమని రూఢీ చేసేలా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారని అన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ నాటకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న తమ వాదన నిజమని ఇవాళ మరోసారి తేలిపోయిందన్నారు. తెలంగాణలో రోజురోజుకు బలోపేతమవుతున్న బీజేపీని దెబ్బతీయాలన్న ఎజెండాతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ‘నువ్వు కొట్టినట్టు చెయ్, నేను తిట్టినట్టు చేస్తా’ అన్న చందాన ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయని పేర్కొన్నారు. పైకి విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. లోన మాత్రం ఆ రెండు పార్టీలు చేతులు కలిపాయన్నారు.
CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన.. ఏర్పాట్లన్నీ పూర్తి
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారని.. పార్లమెంటులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కలిసే ఉన్నారని అన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాన రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మొదటి నుంచీ గట్టిగా పోరాడుతోందని ఒక్క బీజేపీ మాత్రమేనని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థంగా నిర్వహించలేక.. కేసీఆర్‌తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడాన్ని మనం చూస్తూనే ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు మళ్లీ బీఆర్ఎస్ పంచన చేరడం ఖాయమని ఉద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని.. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్ఎస్‌కు ఓటేసినా ఆ ఓటు కేసీఆర్‌కే వెళ్లడం తథ్యమని అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ నాటకాలు ఇంకా ఎక్కువకాలం కొనసాగలేవన్నారు. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నీచ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని జోస్యం చెప్పారు.
Telangana Shakunthala: ఏ పోరి నోట్ల కానీ ఏ పోరడి నోట్ల గానీ పేమ అని వినపడాలి..నరుకుతా దీంతల్లి