సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు నిచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు.
కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.