టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.
తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మార్పు వార్తలను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే రైతులకు ఎలా సరిపోతుంది? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల వాన తో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీపై అర్హత వేటు సరికాదని గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు.