తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది… పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. విమర్శలు, ఆరోపణల పర్వం ఓవైపు.. ప్రచారం, లీక్‌ల పర్వం మరోవైపు సాగుతోంది.. నిన్నటికి నిన్న.. పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారిపోయింది… చావు, బతు, చెడు, మంచి, పెళ్లి, పిల్లలు.. ఇలా అన్నింటికీ తన సోదరుడు సాయం చేస్తూ…