Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా..
- ఇవ్వాళ 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో OP సేవలు బంద్..
- కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో నిరసన..
- ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపివేత..
- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు OP సేవలను బహిష్కరించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు. ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా OP, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలకత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది.
Read also: Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇవ్వాళ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా… అన్ని సేవలు బహిష్కరించి ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులు ఆందోళకు దిగనున్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సంఘాల ఆధ్వర్యంలో వైద్యులను పెద్ద ఎత్తున కదిలిరానున్నారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఇవ్వాళ 9గంటలకు నిమ్స్ బంజారాహిల్స్ గేట్ దగ్గర నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. డెంటల్ డాక్టర్లు పరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఇవ్వాళ ఉదయం 10 గంటలకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల జూడాలు, IMA వైద్యులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.
Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..
జూడాల ఆందోళనకు పిలుపుతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూడాలు రోడ్డుల వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నిరసనలు చేపట్టాలని తెలిపారు. ఎవరికి ఇబ్బందులు తావులేకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు సూచించారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు.
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!