పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీం కోర్టు వారికి హామీ ఇచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
RG Kar EX-Principal: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్‌జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది.
Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశమంతా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి పాల్పడే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు తెలిపాయి.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు.