Kolkata Murder Case : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగి నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Kolkata Rape Case : కోల్‌కతా రేప్ కేసులో ఆరోపణలతో చుట్టుముట్టిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.
కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? అని మండిపడింది.
Kolkata Rape Case : ఆర్‌జి కర్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సిబిఐ విచారణ జరిగి 18 రోజులు గడిచాయి. కేసు ఇంకా క్లిష్టంగానే కనిపిస్తోంది.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్‌కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
Kolkata Rape Case: దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది.…
Kolkata Rape Case postmortem Report: కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని సెమినార్ హాల్లో ఆగస్ట్ 9, 2024న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ చనిపోయింది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో, ఆజ్ తక్‌కు వివరణాత్మక పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. ఇది బాధితురాలిపై జరిగిన క్రూరత్వాన్ని వెల్లడిస్తుంది. నివేదిక ప్రకారం, మృతురాలి శరీరంపై 14 కంటే ఎక్కువ గాయాల గుర్తులు ఉన్నాయి. ఫ్రాక్చర్ ఏవీ కనుగొనబడలేదు.…
కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి.
Kolkata Doctor Rape: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన తర్వాత వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం (ఆగస్టు 14) అర్థరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది.