AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్…
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే…
IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్‌ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి…
వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్ జోడిని కొనసాగించారు. దాంతో హిట్‌మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్‌గా రాహుల్ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్స్ పడగొట్టడంతో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) పరుగులు చేశారు. స్టార్క్ ‘ఆరే’యగా..…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. డే/నైట్ టెస్ట్ మొదటిరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ కాగా.. విరాట్ కోహ్లీ (7) పరుగులే చేసి…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. అడిలైడ్ కోసం సిద్దమైంది. డే/నైట్ మ్యాచ్‌గా జరిగే ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రావడంతో.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.…
తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజులో ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్లేయర్స్ భారీ ధరకు అమ్ముడుపోయారు. ఈసారి పర్స్ వాల్యూను రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచడంతో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. జెడ్డాలో ఆదివారం జరిగిన వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.…