నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో భారత జట్టుకు ఈ సిరీస్ కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 4-0తో గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్టులోనే విజయం సాధించి ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా చూస్తోంది. ఈ కీలక సమరానికి రెండు…
ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు.
పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్ మెగా వేలంకు ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చేశాడు. రాహుల్‌ను రిటైన్ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపినా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదనంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో…
ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)…
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అందరికంటే ముందుగానే కంగారో గడ్డపైకి అడుగుపెట్టారు. నేడు మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ఆరంభమైన అనధికారిక రెండో టెస్టులో బరిలోకి దిగారు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో విఫలమైన రాహుల్ ఈ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే.. మరలా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు యువ ఆటగాడు ధ్రువ్…
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. సోమవారం (నవంబర్ 4)తో ఆటగాళ్ల నమోదు అధికారికంగా ముగియగా.. మొత్తం 1,574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ క్రికెటర్స్ ఉండగా.. 409 మంది విదేశీయులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేలంలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మెగా వేలంలో భారీ ధర పలికే…
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది. న్యూజిలాండ్ సిరీస్‌లోని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) విడుదలైంది. మెగా వేలానికి ముందు, మొత్తం 46 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీ జట్లు అంటిపెట్టుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ జట్లు తమ మేటి ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టనున్నాయి. Read…
Sanjiv Goenka: ఐపీఎల్ 2025లో రిటెన్షన్ జాబితాలో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కు చెదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం నిర్ణయంపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.