రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు. రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప…
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు…
విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశం రచ్చరేపుతుంటే.. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. యాదగిరిగుట్టలో ఆలయం ప్రారంభానికి తనను పిలవలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. అయితే, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో మా ఇష్టం అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దీనికి తోడు తరచుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు గవర్నర్ విందుకి ఆహ్వానిస్తే టీఆర్ఎస్ మంత్రులు ఎవరూ వెళ్లకపోవడంపై…
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. హన్మకొండ జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న విజయశాంతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు.. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న ఆమె.. సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారని తెలిపారు. Read…
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. నృత్య, జానపద కళాకారుల్ని…