నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.…
శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఇవాళ శుక్రవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా లు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. తెలంగాణలో రామరాజ్యం రావటానికి ఏడాది మాత్రమే వుందని, ఇది ఖాయమని బీజేపీ…
జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ మహాసభలకు దేశంలోని ముఖ్యమంత్రులు వస్తారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. 16 రాష్ట్రాల తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం తొలిసారి అని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా బీజేపీ సమావేశాలు జరగనివ్వకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధికార…
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీలోని పలువురు ప్రముఖులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానాలు పంపుతున్నారు. కిషన్‌రెడ్డి ఆహ్వానం పంపిన వారి జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. Read Also:…
భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే…
ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని…
రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి 14 మందితో కూడిన టీంను ఏర్పాటు చేశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ ఉండనున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, శర్వానంద్ సోనోవాల్, అర్జున్ మేఘ్ వాల్, భారతీ పవార్, తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, వానాటి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్ దీప్…