భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కోరారు. సాంస్కృతిక మహోత్సవాలపై తాజాగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో “భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండడం మనందరికీ గర్వకారణం. Read Also : Bheemla Nayak :…
కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…
BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ…
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి సీఎం కేసీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జీవిత కాలం హిందూస్థాన్, పాకిస్థాన్.. అంతేనా అంటూ నిలదీసిన ఆయన.. పుల్వామా సర్జికల్ స్ట్రెక్స్ ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాఫెల్లో అవినీతి…
హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన…
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో…
2015-16 నుండి తెలంగాణలో పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాల అభివృద్ధి మరియు ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.309.53 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.242.19 కోట్లు విడుదలయ్యాయి అని కిషన్రెడ్డి అన్నారు. సోమవారం లోక్సభలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి స్పందిస్తూ.. స్వదేశ్ దర్శన్ పథకం కింద కేంద్రం ఎకో అభివృద్ధికి కేటాయించిన రూ.91.62 కోట్లలో రూ.87.04 కోట్లు విడుదల…
దక్షణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి… ఇక, ఉత్తరాది వారి పెత్తనం దక్షిణాదిపై ఎక్కువగా ఉందని.. అసలు వారి పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా… ఆర్థికాభివృద్ధి, జనాభా నియంత్రణలో దక్షణాది రాష్ట్రాలు ఉంటే.. కేవలం జనాభా పెంచడంపైనా ఉత్తరాధి రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయని విమర్శించారు.. ఏపీ పునర్:వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు పడ్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి…
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. మా అందరికీ మార్గదర్శకుడు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మరణం బాధాకరం. జంగారెడ్డి మరణంపట్ల బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తి……
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు…