Venkaiah Naidu: కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బ్రిటీష్‌వాళ్లు మన సంపద దోచుకొని పోయారు.. మన సంస్కృతిని నాశనం చేసి, వారి సంస్కృతి రుద్దేసి వెళ్లిపోయారు.. మాతృభాష కళ్లు లాంటిది, పరాయి భాష కళ్లద్దాల్లాంటివన్నారు వెంకయ్యనాయుడు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ నేతలు, ప్రజలు. గత ఐదేళ్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Read Also:Minister Roja: కుప్పంలో చంద్రబాబు దొంగఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మహా హారతి కార్యక్రమం చోటు సంపాదించుకుంది. కార్యక్రమ ప్రాంగణంలో భారతమాత భారీ విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. త్రివర్ణ పతాక రంగుల్లో భారీగా హాజరైన విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది హుస్సేన్ సాగర్ తీరం. దేశ భక్తిని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. మనమంతా ఒక్కటే అనే భావన ఈ కార్యక్రమం తెలియజేస్తుంది..
ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారతమాత వీరులను కన్నది.. శాంతి కోసం పోరాడేయోధులను భారతమాత కన్నది.. మన దేశం ఎప్పుడూ విద్వేషాలను రెచ్చగొట్టలేదు..దేశ విస్తీర్ణం కోసం మనమేనాడు పోరాటం చేయలేదు.. శాంతి కోసం చేశాం. బ్రిటిష్ వారు మన సంపదను దోచుకుని.. అనేక విధాలుగా నాశనం చేసి వెళ్లిపోయారు..మనం సోదరభావంతో మెలిగినప్పుడే భారతీయులం..మన చరిత్ర వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్యనాయుడు. వాస్తవ పరిస్థితులు అంటే రాజకీయాలు కాదు.. మహనీయుల చరిత్రలు..
యువతకు మహనీయుల చరిత్రలను తెలియజేయాలి.. వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి. దేశాన్ని ఏకం చేసేదే మహా హారతి.. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి నా అభినందనలు. విద్యార్ధినీ, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అన్నారు వెంకయ్యనాయుడు.
Read Also: Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!