RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై…
Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్…
Kishan Reddy sensational comments on Congress alliance with AIMIM: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారని, పరిపాలన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం చెయ్యడంలో…
Kishan Reddy throws a bold challenge to Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా మరలా గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధం అని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాహుల్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధం అని చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో తిరిగి వచ్చే అవకాశం లేదని, అడ్డంగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు.…
Kishan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీల సమస్యలకన్నా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతోనే రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నాడు. 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా రాహుల్, సోనియా పేర్లే జపించాడు” అని విమర్శించారు. “బీసీ…
Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Kishan Reddy: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీగా ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో రెండో అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేస్తున్న ఘనత సాధించారని పేర్కొంటూ, ఆయనకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అయితే…
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే ప్రాజెక్టులను ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరంగల్, ఖాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం. వ్యాగన్ తయారీ, కోచ్‌ల తయారీ, ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లు మంజూరు చేశాం. దీని ద్వారా 3వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది.…
చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1996, 99 ఎన్నికల సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబుదే.. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించిన ఘనుడు కూడా చంద్రబాబే.. హంద్రీనీవా ప్రాజెక్టు…