Kishan Reddy : తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నకిలీ వాగ్దానాలు, చేతకాని పాలన, మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారీగా బస్సు ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర భారాన్ని మోపుతోంది. ఇది సామాన్య ప్రజల జీవనంపై నేరుగా దెబ్బతీసే నిర్ణయం. ఇలాంటి ప్రజా…
Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు. Uttarpradesh: కారు ఇంజన్ లో పైథాన్.. లగెత్తరో…
Off The Record: తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు మళ్ళుతోంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో… హోరా హోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఈసారి రాష్ట్రంలో…
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
CM Revanth Reddy: తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ లో భాగంగా.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు.. యూరియా సరఫరా చేయకుండా.. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన…
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై…
Kishan Reddy : మోడీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్…
Kishan Reddy sensational comments on Congress alliance with AIMIM: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారని, పరిపాలన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం చెయ్యడంలో…