Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మన్నెగూడలో జరిగిన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు! వేదిక వద్ద ర్యాలీగా వచ్చిన నూతన…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోమారు బీసీల గురించి చర్చను లేవనెత్తారు. తాజాగా మంత్రి బీసీల విషయమై స్పందిస్తూ.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకని మరోసారి నిరూపించుకుందని అన్నారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్నా.. అలాగే అనేకమంది బీసీ సీనియర్ నేతలు ఉన్నా సరే.., అలాగే బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి…
గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాజాసింగ్ హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. హిందుత్వ భావజాలం కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా ఉంది. అందేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి…
21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసన సభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దామని కోరారు. మీరు ఎప్పుడు కలిస్తానని చెప్పిన అప్పుడు వచ్చి కలుస్తానన్నారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీబీఐ విచారణపై మొహం మార్చుకుందని వ్యాఖ్యానించారు. Read Also: Manchu Vishnu: రజనీకాంత్…
Ponnam Prabhakar: హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు నిర్వహించిన ధర్నాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాదు.. హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మండిపడ్డారు. Read…